Bank Locker Rules 2023: బ్యాంకులో లాకర్‌ తీసుకోవాలనుకుంటున్నారా.. అద్దె, నియమాల గురించి తెలుసుకోండి..!

Bank Locker Rules 2023: ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కచ్చితంగా అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

Arun Chilukuri
Published on: 28 Jun 2023 5:04 PM IST
If you want to get a Locker in a Bank Know the Complete Process
X

Bank Locker Rules 2023: బ్యాంకులో లాకర్‌ తీసుకోవాలనుకుంటున్నారా.. అద్దె, నియమాల గురించి తెలుసుకోండి..!

Bank Locker Rules 2023: ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కచ్చితంగా అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే మన దగ్గర ఉన్న డబ్బులు, నగలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవి మాత్రమే ఎలాంటి కష్టాల నుంచైనా మనల్ని రక్షిస్తాయి. నేటి రోజుల్లో విలువైన వస్తువులని దాచుకోవడానికి బ్యాంకులు మాత్రమే సరైనవని చెప్పవచ్చు. ఇందుకోసం చాలామంది బ్యాంకులో లాకర్లు తీసుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ లాకర్‌ తీసుకునేముందు దాని గురించి కొంత అవగాహన కలిగి ఉండాలి. ఆ ప్రాసెస్‌ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

లాకర్ ఎలా పొందాలి

మొదటిసారి లాకర్‌ని తీసుకుంటున్నట్లయితే కొన్ని ముఖ్యమైన నియమాలను అనుసరించాలి. ఒక వ్యక్తికి బ్యాంకులో ఖాతా ఉంటే ఆ బ్యాంకులో సులభంగా లాకర్‌ని పొందవచ్చు. లేదంటే కస్టమర్‌లు 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. లాకర్‌ను పొందడానికి బ్యాంకు నుంచి 'మెమోరాండం ఆఫ్ లెట్టింగ్'పై సంతకం చేయాలి. ఇందులో లాకర్‌ని ఉపయోగించే విధానంపై మొత్తం సమాచారం ఉంటుంది.

జాయింట్ లాకర్ ఎలా పొందాలి?

సింగిల్ కాకుండా బ్యాంకులో జాయింట్ లాకర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఇద్దరు వ్యక్తులు బ్యాంకుకు వచ్చి ఉమ్మడి మెమోరాండంపై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం సదరు బ్యాంకులో సేవింగ్స్ ఖాతాను తెరవమని అడగవచ్చు.

లాకర్ అద్దె ఎంత..?

లాకర్ ఎక్కడ ఉంటుందో దానిపై ఆధారపడి అద్దె ఉంటుంది. లాకర్ సైజును బట్టి ఛార్జీలను నిర్ణయిస్తారు. మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు ఛార్జీలు భిన్నంగా ఉంటాయి. చాలా సార్లు బ్యాంకులు కస్టమర్ల నుంచి 2 నుంచి 3 సంవత్సరాల అద్దెను అడ్వాన్స్‌గా తీసుకుంటాయి. నగరం ఆధారంగా ఈ ఛార్జీ 1,500 నుంచి 20,000 మధ్య ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకుల లాకర్ అద్దె ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి.

లాకర్‌ను ఎలా ఆపరేట్ చేయాలి..?

బ్యాంక్ లాకర్ తీసుకున్న తర్వాత ఉపయోగించడం చాలా సులభం. బ్యాంకుకు వెళ్లి లాకర్ ఆపరేటింగ్ గురించి సమాచారం అందించాలి. బ్యాంక్ కస్టమర్‌ నుంచి ఆధార్, పాన్ వంటి గుర్తింపు కార్డు వివరాలు అడుగుతుంది. తర్వాత కస్టమర్‌ ఒక కీని పొందుతారు. బ్యాంక్ క్లర్క్ మీతో పాటు లాకర్ గదికి వెళ్లి లాకర్ సగం తెరిచి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత మీకు రెండో కీ ఉంటుంది. దీంతో లాకర్‌ని పూర్తిగా తెరిచి పని పూర్తి చేస్తారు. తర్వాత క్లర్క్ మళ్లీ వచ్చి ఈ లాకర్‌ను పూర్తిగా మూసివేస్తాడు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story