Pan Card Not Working: పాన్‌కార్డ్‌ పనిచేయడం లేదా.. ఇక నిత్య జీవితంలో ఈ పనులు అస్సలు చేయలేరు..!

Pancard Not Working: ఈ రోజుల్లో పాన్‌కార్డు అత్యంత ముఖ్యమైన రుజువుగా మారింది. ఇది లేకుంటే దాదాపు ఆర్థిక పనులన్ని ఆగిపోతాయి.

Arun Chilukuri
Updated on: 7 July 2023 8:00 PM IST
If the Pancard is not Working There are Many Problems These Things Which are Necessary in Daily Life Cannot be Done at all
X

Pan Card Not Working: పాన్‌కార్డ్‌ పనిచేయడం లేదా.. ఇక నిత్య జీవితంలో ఈ పనులు అస్సలు చేయలేరు..!

Pancard Not Working: ఈ రోజుల్లో పాన్‌కార్డు అత్యంత ముఖ్యమైన రుజువుగా మారింది. ఇది లేకుంటే దాదాపు ఆర్థిక పనులన్ని ఆగిపోతాయి. అందుకే ప్రభుత్వం పాన్‌కార్డుని, ఆధార్‌తో లింక్‌ చేయడాన్ని తప్పనిసరి చేసింది. జూన్ 30, 2023 వరకు సమయం కేటాయించారు. దీని తర్వాత లింక్‌ చేసుకోని వినియోగదారుల పాన్‌కార్డులు పనిచేయవు. పాన్‌కార్డు లేకుంటే నిత్యజీవితంలో ఈ పనులని చేయలేము. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 114బి ఆర్థిక లావాదేవీలకు పాన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టంగా పేర్కొంది. ఈ పరిస్థితిలో పాన్ కార్డ్ పని చేయకపోతే ఆర్థిక లావాదేవీలు చేయడంలో ఇబ్బంది పడుతారు. బ్యాంక్ ఖాతా తెరవడానికి పాన్ కార్డ్ వివరాలు ఇవ్వాలి. బేసిక్ సేవింగ్స్‌ ఖాతాకి మాత్రం అవసరంలేదు. బ్యాంకు ఖాతాలో రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయడానికి పాన్ కార్డు ఇవ్వాలి. స్టాక్ మార్కెట్లో ఎలాంటి లావాదేవీలకైనా డీమ్యాట్ ఖాతా అవసరం. ఈ ఖాతా తెరవడానికి పాన్ కార్డ్ వివరాలు కచ్చితంగా అందించాలి.

డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు పాన్ కార్డ్ నంబర్‌ను అందించాలి. బీమా ప్రీమియం రూ.50,000 కంటే ఎక్కువ ఉంటే పాన్ కార్డ్ నంబర్ ఇవ్వాలి. హోటల్ లేదా రెస్టారెంట్‌లో ఒకేసారి రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయడానికి పాన్ వివరాలు అవసరమవవుతాయి. ఒకేసారి రూ.50,000 కంటే ఎక్కువ విదేశీ కరెన్సీని మార్చుకోవడానికి లేదా విదేశీ ప్రయాణానికి నగదు చెల్లింపు కోసం పాన్ కార్డ్ నంబర్ అందివ్వాలి. 50,000 కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్ చెల్లింపుల కోసం పాన్ వివరాలను అందించాలి.

కంపెనీకి చెందిన డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి పాన్ కార్డ్ వివరాలను ఇవ్వాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ బాండ్లను కొనుగోలు చేయడానికి పాన్ కార్డ్ ఇవ్వాలి. ఒక రోజులో రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంక్ నుంచి చెల్లింపులు చేయడానికి పాన్‌కార్డ్ వివరాలను అందించాలి. బ్యాంకులో రూ.50,000 పైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.5 లక్షల లావాదేవీలపై పాన్ కార్డ్ వివరాలను అందించాలి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story