GST: డిసెంబరు నెలలో భారీగా పెరిగిన జీఎస్టీ ఆదాయం

GST: 15శాతం మేర పెరిగిన పన్ను వసూళ్లు

Jyothi
Updated on: 1 Jan 2023 9:00 PM IST
GST Revenue increased in the Month of December
X

GST: డిసెంబరు నెలలో భారీగా పెరిగిన జీఎస్టీ ఆదాయం

GST: దేశవ్యాప్తంగా 2022 డిసెంబరు 31 తేదినాటికి సేకరించిన GST స్థూల ఆదాయం ఒక లక్ష 49 వేల 507 కోట్ల రూపాయలుగా నమోదైంది. కేంద్ర జీఎస్టీ వసూళ్లు 26 వేల 711 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు 33వేల 357 కోట్లు వసూళ్లయ్యాయి. I.G.S.T. కింద 78 వేల 434 కోట్ల రూపాయలు వసూళ్లయ్యాయని కేంద్ర ఆర్ధిక శాఖ గణాంకాలను వెల్లడించింది. వస్తువుల దిగుమతి సుంకం 40వేల 263 కోట్లు సెస్సు రూపంలో సేకరించారు. డిసెంబరు నెలలో సాధారణ సెటిల్‌మెంట్‌ తర్వాత కేంద్ర GST కింద 63 వేల 380 కోట్లు, రాష్ట్రGSTకింద 64 వేల 451 కోట్లను కేటాయించినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ వివరించింది.

Jyothi

Jyothi

Next Story