శుభవార్త..శాంతిస్తున్న ఉల్లి ధరలు!

శుభవార్త..శాంతిస్తున్న ఉల్లి ధరలు!
x
Highlights

బెంబేలేత్తిస్తున్న ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్న సూచనలు కంబడుతుండడం తో ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది.

ఉల్లి పేరెత్తితేనే ప్రజలు హడాలేత్తేలా మూడు నెలలుగా కొనసాగుతున్న పరిస్థితులు మారుతున్నాయి. కిలో 200 వరకూ పలికిన ఉల్లి ధరలు కొద్ది కొద్దిగా కిందకు దిగొస్తున్నాయి.

కొత్త పంట అందుబాటులోకి వస్తుండడం.. దిగుమతులు పెరగడంతో ఉల్లి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉల్లి ధరల్లో మార్పు కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ హోల్ సేల్ మార్కెట్ లో మహారాష్ట్ర నుంచి వచ్చిన మేలు రకం ఉల్లి రూ.70 నుంచి 90 వరకు పలుకుతోంది. అలాగే బళ్లారి, కర్నూలు, మహబూబ్‌నగర్‌, మెదక్‌ నుంచి వచ్చిన ఉల్లి రూ.30 నుంచి రూ.50 మధ్య విక్రయిస్తున్నారు. కానీ, మహారాష్ట్ర నుంచి వచ్చే పాత ఉల్లి పంటను మాత్రం రూ.100కు పైగానే పలుకుతోంది.

ఈ ఏడాది అకాల వశాలకు 40 శాతం ఉల్లి పంట దిగుబడి తగ్గింది. దాంతో ఆ ప్రభావం ఉల్లి ధరలపై పడింది. చూస్తుండగానే కిలోకి 200 రూపాయలకు ఉల్లిధరలు చేరిపోయాయి. ప్రభుత్వాలు సబ్సిడీ భరించి ఉల్లిని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. హైదరాబాద్ లో రోజుకు ఏడూ వేల కిలోల సంచులు సరఫరా అవుతూ వస్తున్నాయి. దీంతో ఉల్లికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఆ మేరకు ధరలూ పెరిగిపోయాయి. కిలో 15౦ రూపాయలు దాటి ఉల్లి అమ్మకాలు జరిగాయి. ఇప్పుడు కొత్తపంట అందుబాటులోకి వస్తోంది. దీంతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా సరుకు వస్తుండడంతో ధరలు దిగడం మొదలైంది. మలక్ పేట హోల్ సేల్ మార్కెట్కు గురువారం 8,103 క్వింటాళ్ళ ఉల్లి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో ఉల్లి దిగుమతుల పై ఆంక్షల్ని పాక్షికంగా సడలించింది. దీంతో టర్కీ, ఈజిప్ట్ తదితర దేశాల నుంచి సుమారు 17,090 టన్నుల ఉల్లి జనవరి మధ్య వారంలో దిగుమతి కానుంది. ఢిల్లీలోని అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్‌లో గత వారం ఉల్లి కేజి రూ.65-80 మధ్య ఉండగా.. ఈ వారం అది కాస్తా రూ. 50-75 మధ్యకు తగ్గింది. విదేశాల నుంచి ఉల్లి దిగుమతులు పెద్ద మొత్తంలో రావడంతో ధరలు తగ్గు ముఖం పడుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

కొద్ది వారాలుగా ఆప్గానిస్థాన్ నుంచి ఉల్లి దిగుమతులు జోరుందుకున్నాయి. దీంతో ధరల పెరుగుదలను అదుపు చేయడం సులభతరమవుతుంది. రాజస్థాన్‌లోని అటారీ సరిహద్దులు గుండా ఉల్లి దేశంలోకి వస్తుంది. ఉత్తర భారతంలోనూ కిలో ఉల్లి ధర రూ.100-110 పలుకుతోంది. గురువారం అటారి చెక్ పోస్ట్ మీదుగా ఉల్లిపాయలతో నిండిన 50 ట్రక్కులు చేరుకున్నాయి. మరో 55 ట్రక్కులు రానున్నాయని అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ మేనేజర్ సుఖ్ దేవ్ సింగ్ తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దులో సుమారు 1500-2000 టన్నుల ఉల్లిపాయ దిగుమతి అవుతోంది. అంతర్జాతీయ సరఫరాలో ఉల్లిపాయ టోకు ధరలు 20-30 తగ్గాయని వ్యాపారులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories