పెద్దగా మార్పు లేని బంగారం ధరలు

K V D Varma
Updated on: 25 Sept 2019 1:36 PM IST
పెద్దగా మార్పు లేని బంగారం ధరలు
X

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరల్లో పెద్ద మార్పులు చోటుచేసుకోలేదు. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా 20 రూపాయలు పెరగడంతో 39,400 దగ్గర ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 20 రూపాయలు పెరిగి 36,120 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర ఈ రోజూ స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర మార్పులు లేకుండా 50,071 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నం లలో కూడా ఇదే పరిస్థితి ఉంది.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 38,100 రూపాయలుగా ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర 36,900 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరలో మాత్రం మార్పు లేదు. కేజీ వెండి ధర 50,071 రూపాయలుగానే ఉంది.


K V D Varma

K V D Varma

Next Story