Gold Price Today: బంగారం ధరలు మెల్లగా పైపైకి..

బంగారం ధరలు మళ్లీ పై పై కి వెళుతున్నాయి. నిన్నటి తొ పోలిస్తే ఈరోజు హైదరాబాద్ లో 24 కేరెట్ల ధర పది గ్రాములకు 70 రూపాయలు పెరిగింది.

K V D Varma
Published on: 24 Sept 2019 9:24 AM IST
Gold Price Today: బంగారం ధరలు మెల్లగా పైపైకి..
X

బంగారం ధరలు మళ్లీ పైకి ఎక్కాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయలు పెరగడంతో 39,380 దగ్గర ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 70 రూపాయలు పెరిగి 36,100 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర ఈ రోజూ స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర మార్పులు లేకుండా 50,071 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నం లలో కూడా ఇదే పరిస్థితి ఉంది.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 190 రూపాయలు పెరిగింది. ఇక్కడ 38,100 రూపాయలుగా బంగారం ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 100 రూపాయలు పెరిగి 36,900 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరలో మాత్రం మార్పు లేదు. కేజీ వెండి ధర 50,071 రూపాయలుగానే ఉంది.



K V D Varma

K V D Varma

Next Story