ఈరోజూ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఈరోజూ పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయలు పెరగడంతో 39,210 దగ్గర ఉంది.

K V D Varma
Updated on: 22 Sept 2019 10:29 AM IST
ఈరోజూ పెరిగిన బంగారం ధరలు
X

బంగారం ధరలు ఈరోజూ పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయలు పెరగడంతో 39,210 దగ్గర ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 170 రూపాయలు పెరిగి 36,030 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర రెండో రోజూ స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర మార్పులు లేకుండా 48,765 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నం లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 200రూపాయలు పెరిగింది. ఇక్కడ 37,910 రూపాయలుగా బంగారం ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 200 రూపాయలు పెరిగి 36,800 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరలో మాత్రం మార్పు లేదు. కేజే వెండి ధర 48,765 రూపాయలుగానే ఉంది.


K V D Varma

K V D Varma

Next Story