స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

దేశీయంగా బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

K V D Varma
Updated on: 21 Sept 2019 12:20 PM IST
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
X

బంగారం ధరలు కొద్దిగా పైకి ఎక్కాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 70 రూపాయలు పెరగడంతో 39,110 దగ్గర ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 70 రూపాయలు పెరిగి 35,850 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర రెండో రోజూ స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర మార్పులు లేకుండా 48,765 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నం లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు పెరిగింది. ఇక్కడ 37,710 రూపాయలుగా బంగారం ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 50 రూపాయలు పెరిగి 36,600 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరలో మాత్రం మార్పు లేదు. కేజే వెండి ధర 48,765 రూపాయలుగానే ఉంది.


K V D Varma

K V D Varma

Next Story