బంగారం ధర కొంచెం కిందికి!

బంగారం ధర కొంచెం కిందికి!
x
Highlights

మంగళవారం ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర బుధవారం అతి స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు తగ్గింది. ఇక వెండి ధర కూడా...

మంగళవారం ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర బుధవారం అతి స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు తగ్గింది. ఇక వెండి ధర కూడా స్వల్పంగా 35 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10రూపాయలు తగ్గి 39,500 రూపాయలుగా నిలిచింది. అదేసమయంలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 10రూపాయల తగ్గుదలతో 36,250రూపాయలకు చేరింది. ఇక మార్కెట్ లో వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి ధర 35 రూపాయలు తగ్గి , 48,765రూపాయలకు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర లో ఎటువంటి మార్పూ చోటుచేసుకోలేదు. నిన్నటి ధర 38,100రూపాయల వద్ద నిలకడగా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేవిధంగా 37,000రూపాయల వద్ద స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర మాత్రం 35 రూపాయలు తగ్గి 48,765రూపాయలకు చేరింది. అయితే, గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర దిగివచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.16శాతం తగ్గి 1,510.95 డాలర్లకు దిగింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.53 శాతం క్షీణించి 18.04 డాలర్లకు దిగొచ్చింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories