Top
logo

ఇంకా తగ్గిన బంగారం ధర! మార్పు లేని వెండి ధర!!

ఇంకా తగ్గిన బంగారం ధర! మార్పు లేని వెండి ధర!!
X
Highlights

దేశీయ మార్కెట్లలోనూ, అంతర్జాతీయంగానూ బంగారం ధర శుక్రవారమూ తగ్గింది. అయితే వెండి ధర అంతర్జాతీయంగా తగ్గినప్పటికీ దేశీయంగా మాత్రం స్థిరంగా ఉంది.

గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో బంగారం ధర తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయలు తగ్గి 39,500గా నిలిచింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా 160రూపాయల తగ్గుదలతో 36,180రూపాయల కు చేరింది. ఇక మార్కెట్ లో వెండి ధర లో మాత్రం మార్పు రాలేదు. కేజీ వెండి ధర 51,300రూపాయల వద్దే స్థిరంగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 150రూపాయలు తగ్గి రూ.38,150కు పడిపోయింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయల తగ్గుదలతో 36,950రూపాయలకు తగ్గింది.

గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్‌కు 0.23 శాతం క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.38 శాతం దిగొచ్చింది.


Next Story