Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: బంగారం ధరలు భారీగా తగ్గగా... వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.

Kranthi
Published on: 29 April 2021 6:55 AM IST
Gold-Silver-price-today-on-april-29th-2021-at-Hyderabad-Delhi-Vijayawada-Mumbai-Chennai-64054
X

Gold,Silver Price Today:(File Image)


Gold Price Today: బంగారం ధరలు బారీగా తగ్గాయి. దీంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,490కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 45,490కు చేరింది. గత రెండు రోజులుగా తగ్గతూ వస్తున్న బంగారం ధరలలో ఇవాళ పసిడి ధరలు కాస్తా ఎక్కువగానే పతనమయ్యాయ

దేశంలోని ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,690 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,870గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,490గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేట్ రూ. 45,490గా ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,380గా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.48,400గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,160గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,160గా ఉంది. ఇక బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.40 శాతం క్షీణతతో 1771 డాలర్లకు తగ్గింది.

వెండి ధరలు...

బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న వెండి ధరలు మాత్రం పెరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం సిల్వర్ రేట్స్ దిగోచ్చాయి. ఇవాళ ఉదయం ధరలు తగ్గడంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.678 ఉండగా.. కిలో ధర రూ. 67,800గా ఉంది.

దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.678 ఉండగా.. కేజీ రేట్ రూ.67,800గా ఉంది. ముంబైలో 10 గ్రాముల ధర రూ.678 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ.67,800గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల ధర రూ.735 ఉండగా.. కిలో ధర రూ.73,500కు చేరింది. బెంగుళూరులో 10 గ్రాముల వెండి ధర రూ.678 ఉండగా.. కేజీ ధర రూ.67,800కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్ మార్కెట్లో కూడా ఇదే పద్దతి కనిపించింది. 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.735 ఉండగా.. కేజీ ధర రూ.73,500గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.735 ఉండగా.. కేజీ ధర రూ.73,500గా ఉంది.ఇక అటు బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో వెండి రేటు కూడా తగ్గింది. ఔన్స్‌కు 0.76 శాతం క్షీణతతో 26.20 డాలర్లకు తగ్గింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29-04-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




Kranthi

Kranthi

Next Story