Gold Price Today: తగ్గిన బంగారం, ఒడిదుడుకుల్లో వెండి ధరలు

Gold Price Today: బంగారం ధరలు తగ్గుతూ వుండగా, వెండి ధరల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనపడుతున్నాయి.

Kranthi
Published on: 28 April 2021 7:16 AM IST
Gold, Silver Price Today on April 28th-2021-at Hyderabad-Delhi-Vijayawada-Mumbai-Chennai
X

Gold, Silver Price Today

Gold Price Today: దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గతూ వస్తున్నాయి. దీంతో బంగారం కొనాలని చూస్తున్నవారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇక పెళ్ళీళ్ల సీజన్ ప్రారంభంలోనే పసిడి ధరలు తగ్గడమనేది బంగారం ప్రేమికులకు కాస్తా ఊరట కలిగించే అంశం. బుధవారం ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,800గా ఉంది..

ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,180గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,800గా ఉంది. అలాగే చెన్నై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,650 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,710గా కొనసాగుతుంది. ఇక నిన్న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరకు 1760 డాలర్ల వద్ద చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,450 ఉండగా.. 10గ్రాముల 24 క్యారెట్ల రూ.48,460గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో రూ.44,450 ఉండగా.. 10గ్రాముల 24 క్యారెట్ల రూ.48,460గా ఉంది.

ఒడిదుడుకులకు లోనౌతోన్న వెండి ధరలు...

గత కొన్ని రోజులుగా ఓ వైపు బంగారం ధరలు నెలకు దిగివస్తున్నాయి. కానీ వెండి మాత్రం కాస్తా ఒడిదుడుకులకు లోనవుతుంది. బుధవారం ఉదయం బంగారం ధరలు పతనం కాగా.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. దీంతో ఒక్కసారిగా దేశీయ మార్కెట్లతోపాటు రాష్ట్రాల్లోని జువెల్లరీ మార్కెట్లో సిల్వర్ రేట్స్ మార్పులు జరిగాయి. ఇవాళ ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.688గా ఉండగా.. కిలో వెండి ధర రూ.68,800కు చేరింది.

ప్రధాన నగరాల్లో ఉన్న ధరలు...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.688 ఉండగా.. కేజీ సిల్వర్ రూ.68,800గా ఉంది. ఇక చెన్నైలో 10 గ్రాముల ధర రూ.740 ఉండగా.. కిలో ధర రూ. 74,000గా ఉన్నాయి. దేశ ఆర్థిక్ రాజధాని ముంబైలో 10 గ్రాముల ధర రూ.688గా ఉండగా… కేజీ సిల్వర్ రూ.68,800గా ఉంది. ఇక అలాగే హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.740గా ఉండగా.. కిలో వెండి ధర రూ.74,000 ఉంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 0 గ్రాముల వెండి ధర రూ.740గా ఉండగా.. కిలో వెండి ధర రూ.74,000 ఉన్నాయి.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 28-04-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story