షాకిచ్చిన బంగారం ధరలు..నిలకడగా వెండి!

పండుగ వేళ బంగారం షాక్ ఇచ్చింది. భారీగా పెరిగింది. 26.10.2019 శనివారం బంగారం పై చూపులు చూస్తే.. వెండి నిలకడగా వుంది.

K V D Varma
Updated on: 26 Oct 2019 11:52 AM IST
షాకిచ్చిన బంగారం ధరలు..నిలకడగా వెండి!
X

బంగారం ధరలు శనివారం భారీస్థాయిలో పైకెగశాయి.26.10.2019 శనివారం పది గ్రాముల బంగారం ధర శుక్రవారం తో పోలిస్తే 250 రూపాయల వరకూ పెరిగింది. కాగా, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.

శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 40,220 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 240 రూపాయలు పైకెగసింది. ఈపెరుగుదలతో 36,870 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక శుక్రవారం భారీగా పెరిగిన వెండిధరలు శనివారం ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,770 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,220 , 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,870 రూపాయలుగానూ ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్ లో కూడా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పైకెగసింది. దీంతో 38,850 రూపాయల వద్దకు 24 క్యారెట్ల బంగారం ధర చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 250 రూపాయలు పెరగడంతో 37,650 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక వెండి ధర ఇక్కడ కూడా స్థిరంగా ఉన్నాయి. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,770 రూపాయలు వద్ద నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 26.10.2019 శనివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story