Gold Rates Today 31.10.2019: పైకెగసిన బంగారం ధరలు..అదే దారిలో వెండి!

K V D Varma
Updated on: 31 Oct 2019 11:21 AM IST
Gold Rates Today 31.10.2019: పైకెగసిన బంగారం ధరలు..అదే దారిలో వెండి!
X

నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు పెరిగాయి. 31.10.2019 గురువారం పది గ్రాముల బంగారం ధర మంగళవారంతో పోలిస్తే 100 రూపాయల వరకూ పెరిగింది. కాగా, వెండి ధరలు కుడా అదేబాట పట్టాయి. బుధవారం భారీగా తగ్గిన వెండి గురువారం తిరిగి అదే స్థాయిలో కేజీకి 400 రూపాయలు పెరిగింది.

గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 80 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 39,960 రూపాయలకు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. దీంతో 36,630 రూపాయల వద్దకు చీరుకుంది. ఇక వెండిధరలు కేజీకి 400 పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,900 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,960రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,630 రూపాయలకు పెరిగాయి.

ఢిల్లీ మార్కెట్ లో కుడా బంగారం ధర భారీగా పెరిగింది. ఇక్కడా పదిగ్రాములకు 100 రూపాయలు పెరిగి 38,600 రూపాయల వద్దకు 24 క్యారెట్ల బంగారం ధర చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 100 రూపాయలు పెరిగి 37,400 రూపాయలకు దిగివచ్చింది. ఇక వెండి ధర ఇక్కడ కూడా కేజీకి 400 రూపాయలు పెరిగింది. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,900 రూపాయలు వద్దకు ఎగసింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 31.10.2019 గురువారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story