పైకెగసిన బంగారం ధరలు.. వెండి ధరలూ పెరిగాయి!

కొద్దీ రోజులుగా తగ్గుతూ వస్తున్నా బంగారం, వెండి ధరలు ఈరోజు (30-11-2019) పెరుగుదల నమోదు చేశాయి. బంగారం పది గ్రాములకు 150 రూపాయలు పెరిగింది.

K V D Varma
Updated on: 30 Nov 2019 10:30 PM IST
పైకెగసిన బంగారం ధరలు.. వెండి ధరలూ పెరిగాయి!
X
Todays gold rates: Representational image

కొద్దీ రోజులుగా తగ్గుతూ వస్తున్నా బంగారం ధరలు ఈరోజు దేశీయ మార్కెట్లలో స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. 30.11.2019 శనివారం పది గ్రాముల బంగారం ధర శుక్రవారం ధరలతో పోలిస్తే 120 రూపాయలవరకూ పెరిగింది. మరోవైపు వెండి ధరలు కూడా పైకెగశాయి.

శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయలు పెరిగి 39,510 రూపాయల కు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 110 రూపాయలు పెరిగి 36,220 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు పెరుగుదల నమోదు చేయడంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 200 రూపాయలు పెరిగి 46,350 రూపాయలకు ఎగబాకింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,510 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,220 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా,ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పై చూపులు చూశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 150 రూపాయలు పెరిగింది. దీంతో 38,200 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపోపాయాలు పెరగడంతో 37,000 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర మాత్రం కేజీకి 200 రూపాయలు పెరిగి 46,350 రూపాయల వద్దకు చేరుకున్నాయి.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 30.11.2019 శని వారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ, ఇటూ మారే అవకాశాలు ఉంటాయి.

K V D Varma

K V D Varma

Next Story