Gold Rates Today 30-10-2019: శుభవార్త..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం దిగొచ్చాయి. 40 వేలకు పైగా కదలాడిన బంగారం ధరలు ఈరోజు భారీ తగ్గుదలను నమోదు చేశాయి.
బంగారం ధరలు బుధవారం భారీగా తగ్గాయి. 30.10.2019 బుధవారం పది గ్రాముల బంగారం ధర మంగళవారంతో పోలిస్తే ఏకంగా 320 రూపాయల వరకూ తగ్గింది. కాగా, వెండి ధరలు కుడా అదేబాట పట్టాయి. మంగళవారం భారీపెరుగుదాల నమోదు చేసిన వెండి బుధవారం కేజీకి 400 రూపాయలు తగ్గింది.
మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 320 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,880 రూపాయలకు దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 320 రూపాయలు తగ్గింది. దీంతో 36,530 రూపాయల వద్దకు పడిపోయింది. ఇక వెండిధరలు కేజీకి 400 పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,500 రూపాయలకు చేరుకున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,880రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,530 రూపాయలకు తగ్గాయి.
ఢిల్లీ మార్కెట్ లో కుడా బంగారం ధర భారీగా తగ్గింది. ఇక్కడా పదిగ్రాములకు 350 రూపాయలు తగ్గి 38,500 రూపాయల వద్దకు 24 క్యారెట్ల బంగారం ధర పడిపోయింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 350 రూపాయలు తగ్గి 37,300 రూపాయలకు దిగివచ్చింది. ఇక వెండి ధర ఇక్కడ కూడా కేజీకి 400 రూపాయలు తగ్గింది. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,500 రూపాయలు వద్దకు పడిపోయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 30.10.2019 బుధవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


