Gold Rates Today 29-10-2019: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..పెరిగిన వెండి ధరలు!

K V D Varma
Updated on: 29 Oct 2019 11:06 AM IST
Gold Rates Today 29-10-2019: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..పెరిగిన వెండి ధరలు!
X

బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి.29.10.2019 మంగళవారం పది గ్రాముల బంగారం ధర సోమవారంతో పోలిస్తే 30 రూపాయల వరకూ తగ్గింది. కాగా, వెండి ధరలు పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 40,200 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 30 రూపాయలు తగ్గింది. దీంతో 36,850 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక వెండిధరలు కేజీకి 130 పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,900 రూపాయలకు చేరుకున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,200, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,850 రూపాయలుగానూ ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా నిలిచింది. దీంతో 38,850 రూపాయల వద్ద 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 37,650 రూపాయల వద్ద నిలకడగా ఉంది. ఇక వెండి ధర ఇక్కడ కూడా కేజీకి 130 రూపాయలు పెరిగింది. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,900 రూపాయలు వద్దకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29.10.2019 మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story