స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
x
Highlights

బంగారం ధరలు ఈరోజు దేశీయ మార్కెట్లలో స్వల్పంగా పెరిగాయి. కాగా..వెండి ధరలు దిగివచ్చాయి. 28.11.2019 గురువారం పది గ్రాముల బంగారం ధర బుధవారం ధరలతో పోలిస్తే...

బంగారం ధరలు ఈరోజు దేశీయ మార్కెట్లలో స్వల్పంగా పెరిగాయి. కాగా..వెండి ధరలు దిగివచ్చాయి. 28.11.2019 గురువారం పది గ్రాముల బంగారం ధర బుధవారం ధరలతో పోలిస్తే 20 రూపాయలవరకూ పెరిగాయి. మరోవైపు వెండి ధరలు తగ్గుదల నమోదు చేశాయి.

గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయలు తగ్గి 39,430 రూపాయల వద్దనిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయలు పెరిగి 36,140 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు తగ్గుదల నమోదు చేయడంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 150 రూపాయలు తగ్గి 46,150 రూపాయలుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,430 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,140 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా,ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం మార్పులు లేకుండా 38,100 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా 36,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక వెండి ధర మాత్రం కేజీకి 150 రూపాయలు తగ్గి 46,150 రూపాయల వద్దకు దిగివచ్చింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 28.11.2019 గురువారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ, ఇటూ మారే అవకాశాలు ఉంటాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories