Gold Rates Today 28-10-2019: స్థిరంగా బంగారం ధరలు..వెండి ధరలూ మారలేదు!

K V D Varma
Published on: 28 Oct 2019 7:20 AM IST
Gold Rates Today 28-10-2019: స్థిరంగా బంగారం ధరలు..వెండి ధరలూ మారలేదు!
X

కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 28.10.2019 సోమవారం వారం పది గ్రాముల బంగారం ధర శనివారం నమోదైన ధరల వడ్డే నిలకడగా ఉన్నాయి. కాగా, వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి.

సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఎటువంటి మార్పులూ లేకుండా 40,230 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 36,880 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండిధరలు మూడోరోజూ ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,770 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే విధంగా బంగారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,230, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,880 రూపాయలుగానూ ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా నిలిచింది. దీంతో 38,850 రూపాయల వద్ద 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 37,650 రూపాయల వద్ద నిలకడగా ఉంది. ఇక వెండి ధర ఇక్కడ కూడా స్థిరంగా ఉంది. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,770 రూపాయలు వద్ద నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 28.10.2019 సోమవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story