Gold price today: స్వల్పంగా పెరిగిన బంగారం..నిలకడగా వెండి ధరలు

K V D Varma
Updated on: 27 Jan 2020 7:59 AM IST
Gold price today: స్వల్పంగా పెరిగిన బంగారం..నిలకడగా వెండి ధరలు
X

వరుసగా నాలుగో రోజూ బంగారం ధరలు పైకెగాశాయి. అయితే, నిన్న భారీ పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. గత వారంలో ఒక్క రోజు కిందకు దిగివచ్చిన బంగారం ధరలు మిగిలిన రోజుల్లో పెరుగుతూనే వచ్చాయి. అదే బాటలో ఈరోజు (27.01.2020) కూడా బంగారం ధరలు పైచూపు చూశాయి.

స్వల్పంగా పెరిగిన బంగారం..


మార్కెట్లో సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఏకంగా 10రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 42,090 నుంచి 42,100 రూపాయలకు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. పది గ్రాములకు 10 రూపాయలు పెరగడంతో 38,620నుంచి 38,630 రూపాయల వద్దకు చేరుకుంది.డి

మార్పులేని వెండి ధరలు..


ఒకవైపు బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే.. వెండి ధరలు మార్పులు లేకుండా నిలిచాయి. దీంతో వెండి ధరలు కేజీకి 49,200 రూపాయలు గా వున్నాయి.

విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా.. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 42,100 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,630 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 49,200 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలోనూ..


కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పైకెగాశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 10 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,660 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,460 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా మార్పులు లేకుండా ఉన్నాయి. దాంతో వెండి ధర కేజీకి 49,200 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 27.01.2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


K V D Varma

K V D Varma

Next Story