దిగొచ్చిన బంగారం ధరలు..వెండి ధరలూ తగ్గాయి!
నిన్న స్థిరంగా ఉన్న బనగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్నా వెండి కూడా ఈరోజు కొంచెం తగ్గింది.
నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. కాగా..వెండి ధరలు కూడానా తగ్గుదల నమోదు చేశాయి. 23.11.2019 శనివారం పది గ్రాముల బంగారం ధర శుక్రవారం ధరలతో పోలిస్తే 170 రూపాయల వరకూ తగ్గింది. వెండి ధరలు కూడా కేజీకి 50 రూపాయల వరకూ దిగివచ్చాయి.
శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,680 రూపాయల వద్దకు చేరింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 170 రూపాయలు తగ్గి 36,370 రూపాయలకు చేరింది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి 46,800 రూపాయలకు దిగివచ్చింది.
విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,680 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,470 రూపాయలుగా నమోదయ్యాయి. కాగా,
ఢిల్లీ మార్కెట్ లోనూ బంగారం ధరలు తరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 150 రూపాయలు తగ్గి 38,350 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయలు తరుగుదల నమోదు చేసి 37,150 రూపాయలైంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 50 రూపాయలు తగ్గింది. దీంతో 46,800 రూపాయలకు పడిపోయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 23.11.2019 శనివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


