Good News: భారీగా తగ్గిన బంగారం ధరలు..వెండి ధరలూ తగ్గాయి!

Good News: భారీగా తగ్గిన బంగారం ధరలు..వెండి ధరలూ తగ్గాయి!
x
Highlights

బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. అప్పటికప్పుడే పైకెగుస్తున్నాయి. ఒక్కరోజులో కిందకి దిగివస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా...

బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. అప్పటికప్పుడే పైకెగుస్తున్నాయి. ఒక్కరోజులో కిందకి దిగివస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా కిందకు దిగివచ్చాయి. ఈరోజు (23.01.2020) బంగారం ధరలు భారీగా తగ్గాయి. అదే విధంగా నిన్న బంగారం తో పాటు పైకెగసిన కనిపించిన వెండి ధరలు కూడా ఈరోజు ఢమాల్ అన్నాయి.

బాగా తగ్గిన బంగారం..

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు బుధ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 350 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 41,830 నుంచి 41,480 రూపాయలకు దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో తగ్గుదల నమోదు చేసింది. పది గ్రాములకు 340పాయలు తగ్గడంతో 38,360 నుంచి 38,020 రూపాయల వద్దకు చేరుకుంది.

వెండి ధరలూ తగ్గాయి..

బంగారం వెంటే వెండి ధరలూ నడిచాయి. దీంతో వెండి ధరలు కూడా కేజీకి ఏకంగా ఒక్కసారిగా 600 రూపాయలు తగ్గాయి. దీంతో కేజీ వెండిధర 49,600 నుంచి 49,000 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇలానే..

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 41,480 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,020 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 49,000 రూపాయలకు పడిపోయింది.

దేశరాజధాని ఢిల్లీలోనూ..

కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు కిందికి దిగివచ్చాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 350 రూపాయలు పడిపోయింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,050 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 350 రూపాయల తగ్గుదల నమోదు చేసి 38,850 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 600 రూపాయలు దిగివచ్చింది. దాంతో వెండి ధర కేజీకి 49,000 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 23.01.2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories