స్థిరంగా బంగారం ధరలు.. నిలకడగానే వెండి ధరలు!

రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నా బంగారం, వెండి ధరలు ఈరోజు (18-11-2019) నిలకడగా ఉన్నాయి.

K V D Varma
Published on: 18 Nov 2019 7:52 AM IST
స్థిరంగా బంగారం ధరలు.. నిలకడగానే వెండి ధరలు!
X

రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నా బంగారం ధరలు ఈరోజు యధాతథంగా నిలిచాయి. కాగా..నిన్న భారీగా తగ్గిన వెండి ధరలు కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి. 18.11.2019 సోమవారం పది గ్రాముల బంగారం ధర ఆదివారం నాటి ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. వెండి ధరలు కూడా ఎటువంటి మార్పులూ లేకుండా ఉన్నాయి.

సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా 39,760రూపాయలుగా నిలిచింది.. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 36,450 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు హైదరాబాద్ లో కేజీ వెండి ధర నిలకడగా 48,000 రూపాయల వద్ద ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,760 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,450 రూపాయలుగా ఉన్నాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లోనూ బంగారం ధరలు ఎటువంటి మార్పులకూ గురికాలేదు. దేంతో 24 క్యారెట్ల బంగారం 38,400 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 37,200 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి ధర ఇక్కడా మారలేదు. దీంతో నిన్నటి ధర 48,000 రూపాయలవద్ద స్థిరంగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 18.11.2019 సోమవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story