బంగారం ధరలు తగ్గాయి.. వెండి ధరలూ భారీగా తగ్గాయి!

నిన్న నిలకడగా ఉన్న బంగారం, వెండి ధరలు ఈరోజు(19-11-2019) తగ్గాయి. బంగారం పది గ్రాములకు 90 .. వెండి కేజీకి 200 రూపాయలు తగ్గింది.

K V D Varma
Published on: 19 Nov 2019 6:47 AM IST
బంగారం ధరలు తగ్గాయి.. వెండి ధరలూ భారీగా తగ్గాయి!
X

నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. కాగా..వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి. 19.11.2019 మంగళవారం పది గ్రాముల బంగారం ధర సోమవారం ధరలతో పోలిస్తే 90 రూపాయల వరకూ తగ్గింది. వెండి ధరలు కూడా కేజీకి 200 రూపాయల వరకూ తగ్గాయి.

మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,670 రూపాయల వద్దకు చేరింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 90 రూపాయలు తగ్గి 36,360 రూపాయలకు చేరింది. మరోవైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 200 రూపాయలు తగ్గి 47,800 రూపాయలకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,670 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,360 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లోనూ బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 100 రూపాయలు తగ్గి 38,300 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 37,100 రూపాయలైంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 200 రూపాయలు తగ్గింది. దీంతో 47,800 రూపాయలకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 19.11.2019 మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story