మళ్ళీ తగ్గిన బంగారం ధర.. భారీగా పడిపోయిన వెండి!

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. కాగా..వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అయ్యాయి.

K V D Varma
Published on: 17 Nov 2019 8:31 AM IST
మళ్ళీ తగ్గిన బంగారం ధర.. భారీగా పడిపోయిన వెండి!
X

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. కాగా..వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అయ్యాయి. 17.11.2019 ఆదివారం పది గ్రాముల బంగారం ధర శనివారం ధరలతో పోలిస్తే 50 రూపాయల వరకూ తగ్గింది. వెండి ధరలు కూడా కేజీకి 650 రూపాయల వరకూ తగ్గాయి.

ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,760రూపాయల వద్దకు చేరింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 40 రూపాయలు తగ్గి 36,450 రూపాయలకు చేరింది. మరోవైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 650 రూపాయలు తగ్గి 48,000 రూపాయలకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,760 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,450 రూపాయలుగా నమోదయ్యాయి. కాగా, ఢిల్లీ మార్కెట్ లోనూ బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 100 రూపాయలు తగ్గి 38,400 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 37,200 రూపాయలైంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 650 రూపాయలు తగ్గింది. దీంతో 48,000 రూపాయలకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 17.11.2019 ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story