దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలూ తగ్గాయి!

దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలూ తగ్గాయి!
x
Highlights

నిన్న ఒక్కసారిగా పెరిగి షాకిచ్చిన బంగారం ధరలు ఈరోజు కాస్త దిగొచ్చాయి. కాగా..వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేసాయి.

నిన్న ఒక్కసారిగా పెరిగి షాకిచ్చిన బంగారం ధరలు ఈరోజు కాస్త దిగొచ్చాయి. కాగా..వెండి ధరలు కూడా అదే దారిలో కాస్త తగ్గుదల నమోదుచేసాయి. 16.11.2019 శనివారం పది గ్రాముల బంగారం ధర శుక్రవారం ధరలతో పోలిస్తే 130 రూపాయల వరకూ తగ్గింది. వెండి ధరలు కూడా కేజీకి 190 రూపాయల వరకూ తగ్గాయి.

శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 130 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,810రూపాయల వద్దకు చేరింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 130 రూపాయలు తగ్గి 36,490 రూపాయలకు చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 190 రూపాయలు తగ్గి 48,650 రూపాయలకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,810 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,490 రూపాయలుగా నమోదయ్యాయి. కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 100 రూపాయలు తగ్గి 38,500 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 37,300 రూపాయలైంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 190 రూపాయలు తగ్గింది. దీంతో 48,650 రూపాయలకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 15.11.2019 శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.

Keywords : gold rates decreased, gold rates today, silver rates today, today gold rates, gold rates in Hyderabad, Silver rates in Hyderabad, Today gold and silver rates, బంగారం ధరలు, ఈరోజు బంగారం ధరలు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories