Today Gold Rate: బంగారం ధర తగ్గుతోంది..వెండి ధర మాత్రం పైకి కదులుతోంది!

K V D Varma
Updated on: 12 Nov 2019 10:54 AM IST
Today Gold Rate: బంగారం ధర తగ్గుతోంది..వెండి ధర మాత్రం పైకి కదులుతోంది!
X

బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అదే సమయంలో వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. 12.11.2019 మంగళవారం పది గ్రాముల బంగారం ధర సోమవారం ధరలతో పోలిస్తే పది గ్రాములకు 50 రూపాయల వరకూ తగ్గింది. కాగా, వెండి ధరలు మాత్రం స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి.

మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,550రూపాయల వద్దకు దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయలు తగ్గి 36,250 రూపాయలకు చేరింది. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 50 రూపాయలు పెరిగి 48,700రూపాయలకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,550 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,250 రూపాయలుగా నమోదయ్యాయి. కాగా, ఢిల్లీ మార్కెట్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 120 రూపాయలు తగ్గింది. దీంతో బంగారం 38,200 రూపాయల వద్ద చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలు తగ్గి 37,000 రూపాయల వద్దకు దిగింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 50 రూపాయలు పెరిగింది. దీంతో 48,700రూపాయలకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 12.11.2019 మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది


K V D Varma

K V D Varma

Next Story