మరింత తగ్గిన బంగారం..స్వల్పంగా పెరిగిన వెండి!

మరింత తగ్గిన బంగారం..స్వల్పంగా పెరిగిన వెండి!
x
Highlights

రెండో రోజూ బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు 10-11-2019 బంగారం 10 గ్రాములకు 50 రూపాయల తగ్గింది. వెండి కేజీకి 50 రూపాయలు పెరిగింది.

రెండోరోజూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10.11.2019 ఆదివారం పది గ్రాముల బంగారం ధర శనివారం ధరలతో పోలిస్తే పది గ్రాములకు 50 రూపాయల వరకూ తగ్గింది. కాగా, వెండి ధరలు మాత్రం స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,600 రూపాయల వద్దకు దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయలు తగ్గి 36,300 రూపాయలకు చేరింది. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి 48,650 రూపాయలకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,600 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,300 రూపాయలుగా నమోదయ్యాయి. కాగా, ఢిల్లీ మార్కెట్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు తగ్గింది. దీంతో బంగారం 38,320 రూపాయల వద్ద చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 50 రూపాయలు తగ్గి 37,050 రూపాయల వద్దకు దిగింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 50 రూపాయలు పెరిగింది. దీంతో 48,650 రూపాయలకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 10.11.2019 ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories