శుభవార్త!మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలూ తగ్గాయి!

బంగారం ధరలు ఈరోజు 09-11-2019 పది గ్రాములకు 250 రూపాయలవరకూ తగ్గాయి. వెండి ధరలు కూడా కేజీకి రూ.150ల తగ్గుదల నమోదు చేశాయి.

K V D Varma
Updated on: 9 Nov 2019 10:50 AM IST
శుభవార్త!మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలూ తగ్గాయి!
X

నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. 09.11.2019 శనివారం పది గ్రాముల బంగారం ధర శుక్రవారం ధరలతో పోలిస్తే పది గ్రాములకు 250 రూపాయల వరకూ తగ్గింది. కాగా, వెండి ధరలు మాత్రం స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,650 రూపాయల వద్దకు దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 230 రూపాయలు తగ్గి 36,350 రూపాయలకు చేరింది. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 150 రూపాయలు తగ్గి 48,600 రూపాయలకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,650 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,350 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 180 రూపాయలు తగ్గింది. దీంతో బంగారం 38,370 రూపాయల వద్ద చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 250 రూపాయలు తగ్గి 37,100 రూపాయల వద్దకు దిగింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 150 రూపాయలు తగ్గింది. దీంతో 48,600 రూపాయలకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 09.11.2019 శనివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది


K V D Varma

K V D Varma

Next Story