దిగివచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలూ తగ్గుముఖం

దిగివచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలూ తగ్గుముఖం
x
Highlights

రెండురోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. ఈరోజు (08. 01.2020) బంగారం ధరలు కొద్దిగా దిగివచ్చాయి. అదే విధంగా నిన్న భారీగా పెరిగిన వెండి...

రెండురోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. ఈరోజు (08. 01.2020) బంగారం ధరలు కొద్దిగా దిగివచ్చాయి. అదే విధంగా నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు కూడా కిందికి వచ్చాయి.

హైదరాబాద్ మార్కెట్లో బుధవారం ధరలు మంగళవారం ధరలతో పోలిస్తే కొద్దిగా దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 530 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 41,980 రూపాయలకు దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో తగ్గుదల నమోదు చేసింది. పది గ్రాములకు 530 రూపాయలు తగ్గడంతో 39,430 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా కేజీకి 250 రూపాయలు తగ్గాయి. దీంతో కేజీ వెండిధర 50,750 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 41,980 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,430 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు కిందికి వచ్చాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 560 రూపాయలు దిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,440 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 550 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,250 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 250 రూపాయలు తగ్గింది. దాంతో వెండి ధర కేజీకి 50,750 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 08.01.2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories