logo

శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు..వెండి ధరలూ కిందికే!

శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు..వెండి ధరలూ కిందికే!
Highlights

దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. 07.11.2019 గురువారం పది గ్రాముల బంగారం 400 రూపాయల వరకూ తగ్గింది.

కొన్నిరోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. 07.11.2019 గురువారం పది గ్రాముల బంగారం ధర బుధవారం ధరలతో పోలిస్తే, 400 రూపాయల వరకూ తగ్గింది. కాగా, వెండి ధరలూ అదే దారిలో ఉన్నాయి.

గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో పది గ్రాముల ధర 39,900 రూపాయలకు దిగింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 360 రూపాయలు తగ్గింది. దీంతో 36,580 రూపాయలైంది. ఇక వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 200 రూపాయలు తగ్గి 48,500 రూపాయలకు దిగింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,900 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,580 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 400 రూపాయలు తగ్గి 38,550 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 400 రూపాయలు తగ్గి 37,350 రూపాయల వద్దకు దిగింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 200 రూపాయలు తగ్గింది. దీంతో 48,500 రూపాయలకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 07.11.2019 గురువారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది



లైవ్ టీవి


Share it
Top