Gold Rates Today 6-11-2019: మళ్లీ తగ్గిన బంగారం..స్వల్పంగా తగ్గిన వెండి

దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు 06-11-2019 స్వల్పంగా తగ్గాయి. అదేవిధంగా నిన్న భారీగా పెరిగిన వెండి కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేసింది.

K V D Varma
Updated on: 6 Nov 2019 10:13 AM IST
Gold Rates Today 6-11-2019: మళ్లీ తగ్గిన బంగారం..స్వల్పంగా తగ్గిన వెండి
X

నిన్నస్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజూ మరింత తగ్గాయి. 06.11.2019 బుధవారం పది గ్రాముల బంగారం ధర మంగళవారం ధరలతో పోలిస్తే, 70 రూపాయల వరకూ తగ్గింది. కాగా, నిన్న భారీస్థాయిలో పైకెగసిన వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి.

బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 70 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో పది గ్రాముల ధర 40,300 రూపాయలకు దిగింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరకూడా 70 రూపాయలు తగ్గింది. దీంతో 36,940రూపాయలైంది. ఇక వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి 48,700 రూపాయలకు దిగింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,300 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,940 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు తగ్గి 38,950 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 50 రూపాయలు తగ్గి 37,750 రూపాయల వద్దకు దిగింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 50 రూఒపాయలు తగ్గింది. దీంతో 48,700 రూపాయలకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 06.11.2019 బుధవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది


K V D Varma

K V D Varma

Next Story