ఈ రోజూ తగ్గిన బంగారం ధరలు.. భారీగా పెరిగిన వెండి!

వరుసగా రెండో రోజూ (04-12-2019) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి.

K V D Varma
Published on: 4 Dec 2019 7:24 AM IST
ఈ రోజూ తగ్గిన బంగారం ధరలు.. భారీగా పెరిగిన వెండి!
X

నిన్న తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజూ దేశీయ మార్కెట్లలో స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం పైకెగశాయి. 04.12.2019 బుధవారం పది గ్రాముల బంగారం ధర మంగళవారం ధరలతో పోలిస్తే 50 రూపాయలవరకూ తగ్గింది. వెండి ధరలు కేజీకి 250 రూపాయల వరకూ పెరిగాయి.

బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలు తగ్గి 39,520 రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 40 రూపాయలు తగ్గి 36,230 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు భగ్గుమన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 250 రూపాయలు పెరికి 46,900 వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,520 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,230 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు తగ్గింది. దీంతో 38,200 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయలు తగ్గడంతో 37,000 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర కేజీకి 250 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 46,900 రూపాయలకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 04.12.2019 మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ, ఇటూ మారే అవకాశాలు ఉంటాయి.


K V D Varma

K V D Varma

Next Story