Gold Rates Today 04-11-2019: మార్పులేని బంగారం ధరలు..స్థిరంగా వెండి!

నిన్న భారీస్థాయిలో పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. 04.11.2019 సోమవారం పది గ్రాముల బంగారం ధర ఆదివారం నాటి స్థాయిలోనే నిలిచాయి.

K V D Varma
Published on: 4 Nov 2019 7:31 AM IST
Gold Rates Today 04-11-2019: మార్పులేని బంగారం ధరలు..స్థిరంగా వెండి!
X

నిన్న భారీస్థాయిలో పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. 04.11.2019 సోమవారం పది గ్రాముల బంగారం ధర ఆదివారం నాటి స్థాయిలోనే నిలిచాయి. కాగా, రెండురోజుల పాటుగా భారీ పతనాన్ని చూసిన వెండి ధరలు స్థిరంగా నిలిచాయి. వెండి ధరలు సోమవారం ఎటువంటి మార్పులకూ లోను కాలేదు.

సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా నిలిచింది. దీంతో పది గ్రాముల ధర 40,410 రూపాయల వద్ద ఉంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలోనూ మార్పులేదు. దీంతో 37,050 రూపాయల వద్ద నిలకడగా వుంది. ఇక వెండిధరలూ అలానే ఉన్నాయి.దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 39,000 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,430రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 37,050 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 39,050 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 37,850 రూపాయల వద్ద నిలకడగా ఉంది. ఇక వెండి ధర కూడా ఎటువంటి మార్పులకు గురికాలేదు. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 39,000 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 04.11.2019 సోమవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది

K V D Varma

K V D Varma

Next Story