నిలకడగా బంగారం ధరలు.. మార్పులు లేని వెండి ధర!

ఆదివారం అమాంతం పెరిగిన బంగారం ధరలు ఈరోజు (02-12-2019) స్థిరంగా నిలిచాయి. ఇక వెండి ధరలు కూడా ఎటువంటి మార్పులు లేకుండా ఉన్నాయి.

K V D Varma
Published on: 2 Dec 2019 7:32 AM IST
నిలకడగా బంగారం ధరలు.. మార్పులు లేని వెండి ధర!
X
Today Gold rates Representational image

నిన్నభారీగా పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు దేశీయ మార్కెట్లలో స్థిరంగా నిలిచాయి. మరోవైపు వెండి ధరలు కూడా అదేదారిలో నిలకడగా ఉన్నాయి. 02.12.2019 సోమవారం పది గ్రాముల బంగారం ధర ఆదివారం నాటి ధరల వద్దే మార్పులు లేకుండా నిలిచాయి.

సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా 39,770 రూపాయల వద్ద ఉంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పులు లేకుండా 36,460 రూపాయల వద్ద నిలిచింది. ఇక వెండి ధరలు కూడా ఎటువంటి మార్పులకు గురికాలేదు.దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,650 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,770 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,460 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు కదలిక లేకుండా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం స్థిరంగా 38,400 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పులు లేకుండా 37,200 రూపాయల వద్ద నిలిచింది. ఇక వెండి ధర కూడా నిలకడగా 46,650 రూపాయల వద్ద ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02.12.2019 సోమవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ, ఇటూ మారే అవకాశాలు ఉంటాయి.


K V D Varma

K V D Varma

Next Story