Gold Rates today 02-11-2019:స్వల్పంగా పెరిగిన బంగారం..భారీగా తగ్గిన వెండి!

K V D Varma
Updated on: 2 Nov 2019 8:26 AM IST
Gold Rates today 02-11-2019:స్వల్పంగా పెరిగిన బంగారం..భారీగా తగ్గిన వెండి!
X

ఈరోజూ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 02.11.2019 శనివారం పది గ్రాముల బంగారం ధర శుక్రవారంతో పోలిస్తే 10 రూపాయల వరకూ పెరిగింది. కాగా, వెండి ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు శనివారం కేజీకి ఏకంగా 450 రూపాయలు తగ్గాయి.

శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 40,070 రూపాయలకు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగింది. దీంతో 36,740 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక వెండిధరలు కేజీకి 450 రూపాయలు తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,500 రూపాయలకు దిగివచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,070రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,740 రూపాయలకు పెరిగాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధర స్థిరంగా ఉంది. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 38,700 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 37,500 రూపాయల వద్ద మార్పు లేకుండా కొనసాగుతోంది. ఇక వెండి ధర ఇక్కడ కూడా కేజీకి 450 రూపాయలు తగ్గింది. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,500 రూపాయలు వద్దకు దిగివచ్చింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02.11.2019 శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story