Gold Rates Today 01-11-2019:ఈరోజూ పెరిగిన బంగారంధరలు
ఈరోజూ బంగారం ధరలు పెరిగాయి. 01.11.2019 శుక్రవారం పది గ్రాముల బంగారం ధర గురువారంతో పోలిస్తే 100 రూపాయల వరకూ పెరిగింది. కాగా, వెండి ధరలు కుడా అదేబాట పట్టాయి. గురువారం భారీగా పెరిగిన వెండి శుక్రవారం కూడా కేజీకి 50 రూపాయలు పెరిగింది.
శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 40,060 రూపాయలకు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. దీంతో 36,730 రూపాయల వద్దకు చీరుకుంది. ఇక వెండిధరలు కేజీకి 50 రూపాయలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,950 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,960రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,730 రూపాయలకు పెరిగాయి
ఢిల్లీ మార్కెట్ లో కుడా బంగారం ధర పెరిగింది. ఇక్కడా పదిగ్రాములకు 100 రూపాయలు పెరిగి 38,700 రూపాయల వద్దకు 24 క్యారెట్ల బంగారం ధర చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 100 రూపాయలు పెరిగి 37,500 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధర ఇక్కడ కూడా కేజీకి 50 రూపాయలు పెరిగింది. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,950 రూపాయలు వద్దకు ఎగసింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 01.11.2019 శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది


