Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి ధరలు.. ఈరోజు రేట్లిలా..

Gold Rate: నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు పైకెగాశాయి. మరోవైపు వెండి ధరలు ఒక్కసారే రెండువేలకు పైగాపెరిగి షాకిచ్చాయి. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

K V D Varma
Updated on: 30 Sept 2020 7:00 AM IST
Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి ధరలు.. ఈరోజు రేట్లిలా..
X

నాలుగు రోజులుగా తగ్గుదల బాటలోనే కొనసాగిన బంగారం ధరలు కొద్దిగా పైచూపులు చూశాయి. బంగారం ధరలు మంగళవారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 30) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు భారీస్థాయిలో పెరుగుదల నమోదు చేసి షాకిచ్చాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (30.09.2020) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 460 రూపాయలు పెరిగి 48,160 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 490 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,530 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు షాక్..

బంగారం ధరలు కొద్దిపాటి పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు షాకిచ్చాయి. భారీ స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు 2700 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 60 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 60,700 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. బుధవారం (30.09.2020) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 460 రూపాయలు పెరిగి 48,160 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 490 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,530 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు పెరుగుదల కనబరిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 550 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 610 రూపాయలు పెరిగింది. దాంతో 53,350 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. ఇక్కడా వెండి ధరలు షాకిచ్చాయి. భారీ స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు 2700 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 60,700 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 30-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story