Gold Rate:మళ్ళీ పెరిగిన బంగారం ధరలు..వెండి ధరలూ ఎగశాయి!

Gold Rate: వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు హైదరాబాద్ లో మళ్ళీ స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 30) దేశీయంగా పెరుగుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

K V D Varma
Published on: 30 Jun 2020 9:05 AM IST
Gold Rate:మళ్ళీ పెరిగిన బంగారం ధరలు..వెండి ధరలూ ఎగశాయి!
X

వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు(Gold Rate) హైదరాబాద్ లో మళ్ళీ స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 30) దేశీయంగా పెరుగుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం (30.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 40 రూపాయలు పెరిగింది. దీంతో 46,450 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 40 రూపాయల పెరుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,660 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు కూడా అదేదారిలో పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే 390 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48వేల మార్కు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 48,500 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 40 రూపాయలు పెరిగింది. దీంతో 46,450 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 40 రూపాయల పెరుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,660 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం ధరతో పోలిస్తే 40 రూపాయలు పెరిగి 47,250 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం ధర కంటే 40 రూపాయలు పెరిగింది. దీంతో 48,450 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 39౦ రూపాయల పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 48 వేల మార్కుకు ఎగసి 48,500 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 30-06-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story