Gold Rate: బంగారం ధరల బాదుడు.. వెండి ధరల దూకుడు!!

బంగారం భగ్గుమంటూనే ఉంది. మరోవైపు వెండి ఈరోజు రికార్డు స్థాయిలో పరుగులు తీసింది.

K V D Varma
Published on: 29 July 2020 6:16 AM IST
Gold and silver rate today 29th july
X
gold rate today

బంగారం భగ్గుమంటూనే ఉంది. మరోవైపు వెండి ఈరోజు రికార్డు స్థాయిలో పరుగులు తీసింది. హైదరాబాద్ లో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 29) దేశీయంగా భారీ పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు దూకుడు ప్రదర్శించాయి. రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు భారీ పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (29.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 590 రూపాయలు పెరిగింది. దీంతో 50,370 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 640 రూపాయలు పెరిగింది. దీంతో 54 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 54,940 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు రికార్డు పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే భారీగా పెరిగింది. ఈరోజు ఏకంగా 1300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 66 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 66,000 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 590 రూపాయలు పెరిగింది. దీంతో 50,370 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 640 రూపాయలు పెరిగింది. దీంతో 54 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 54,940 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం ధరతో పోలిస్తే 450 రూపాయలు పెరిగి 51,250 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం ధరతో పోలిస్తే 450 రూపాయలు పెరిగింది. దీంతో 52,450 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా రికార్డు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 66 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 66,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story