శుభవార్త : పడిపోయిన బంగారం ధర.. అదే బాటలో వెండి

శుభవార్త : పడిపోయిన బంగారం ధర..  అదే బాటలో వెండి
x
Highlights

బంగారం ధరలు భారీగా పడిపోయాయి. వెండి ధరలు కస్త తగ్గదుల నమోదు చేసుకున్నాయి.

వారం రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరలకు కళ్ళెం పడింది. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్నబంగారం ధరలు మళ్లి కాస్త తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గుదల నమోదు చేశాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు నిలకడగా నిలిచింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 44,340 రూపాయల వద్ద నిలిచింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల నమోదు చేసింది. 10 గ్రాములకు 360 రూపాయలు తగ్గింది. దీంతో 40,970 రూపాయల నుంచి 40,610 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది.

కాస్త తగ్గిన వెండి ధరలు.. బంగారం ధర మిశ్రమంగా కదిలితే, వెండి ధరలు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో బుధవారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర కేజీకి నిన్నటి ధర కంటే 200 రూపాయలు తగ్గి 50,000 రూపాయల నుంచి 49,800 రూపాయలకు తగ్గింది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా...

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 44,340 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 40,610 రూపాయలు నమోదు చేశాయి. కాగా, వెండి ధరలు ఇక్కడా కేజీకి 1500 రూపాయలు తగ్గింది. దీంతో కెజీ వెండీ 49,800 రూపాయల వద్దకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 42,650 రూపాయల వద్ద ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పులు లేకుండా 41,450 రూపాయల వద్ద నిలిచింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా కాస్త తగ్గింది. దీంతో కేజీ వెండి 49,800 రూపాయలకు చేరుకుంది. ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 27-02-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories