Gold Rate: వరుసగా మూడోరోజూ దిగివచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలు భారీ పతనం!

Gold Rate: వరుసగా మూడోరోజూ దిగివచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలు భారీ పతనం!
x
Gold rate today
Highlights

Gold Rate: బంగారం ధరలు కిందికే కదులుతున్నాయి. వరుసగా మూడోరోజు తగ్గుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు భారీగా తగ్గాయి.

మూడురోజులుగా తగ్గుతూ వస్తున్నబంగారం ధరలు ఈరోజు కూడా మరికొంత తగ్గాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తున్నాయి.. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 26) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కూడా కొద్దిగా తగ్గాయి. బుధవారం (26.08.2020) బంగారం ధరలు మంగళవారం ధరలతో పోలిస్తే తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 550 రూపాయలు తగ్గి 49,480 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 530 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 54,050 రూపాయల వద్ద నిలిచింది.

భారీగా తగ్గిన వెండి ధరలు ..

బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు 1200 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 66వేల రూపాయల స్థాయికి వెండి ధరలు కదిలాయి. దీంతో కేజీ వెండి ధర 65,500 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 550 రూపాయలు తగ్గి 49,480 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 530 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 54,050 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కాస్త కిందికి కదిలాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటి ధర కంటె 450 రూపాయలు తగ్గింది. దీంతో 50,250 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం నాటి ధర కంటె 440 రూపాయలు తగ్గింది. దాంతో 54,870 రూపాయలకు దిగివచ్చింది. ఇక వెండి ధరలు.. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు 1200 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 66వేల రూపాయల స్థాయికి వెండి ధరలు కదిలాయి. దీంతో కేజీ వెండి ధర 65,500 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 26-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories