Gold Rate: శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధరలు..వెండి ధరల భారీ పతనం!

Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త! నిన్న ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు ఈరోజు భారీ స్థాయిలో కిందకి దిగి వచ్చాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

K V D Varma
Published on: 25 Nov 2020 7:13 AM IST
gold rate today in India, Hyderabad, Delhi
X

gold rate today (representational image)

బంగారం ధరలు ఈరోజు భారీ తగ్గుదల నమోదు చేశాయి. బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరల తొ పోలిస్తే దాదాపు వెయ్యి రూపాయల వరకూ కిందికి దిగొచ్చాయి.. బంగారం ధరలు ఈరోజు (25.11.2020) కింది చూపులు చూశాయి. మరో వైపు వెండి ధరలు కూడా భారీ స్థాయిలో కిందికి దిగోచ్చాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు భారీగా తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం (25.11.2020) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే బాగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 900 రూపాయల తగ్గుదల నమోదు చేసి 46,200 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 980 రూపాయలు కిందికి దిగివచ్చింది. దీంతో 50,400 రూపాయల వద్దకు చేరుకుంది.

వెండి ధరలు భారీ పతనం!

బంగారం ధరలు కిందికి దిగోస్తే, మరోవైపు వెండి ధరలు కూడా అదేవిధంగా భారీ తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 2200 రూపాయలు తగ్గింది. దీంతో కేజీ వెండి ధర 64,500 రూపాయలకు పడిపోయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. బుధవారం (25.11.2020) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే బాగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 900 రూపాయల తగ్గుదల నమోదు చేసి 46,200 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 980 రూపాయలు కిందికి దిగివచ్చింది. దీంతో 50,400 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 900 రూపాయలు తగ్గింది. దీంతో 48,250 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 980 రూపాయలు తగ్గుదల కనబరిచింది. దీంతో 52,630 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు భారీగా తగ్గాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 2000 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 60,000 రూపాయల వద్దకు పడిపోయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 25-11-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story