Gold Rate: శుభవార్త.. దిగివస్తున్న బంగారం ధరలు.. వెండి ధరలు భారీ పతనం..!

Gold Rate: శుభవార్త.. దిగివస్తున్న బంగారం ధరలు.. వెండి ధరలు భారీ పతనం..!
x
Highlights

Gold Rate: బంగారం ధరలు క్రమేపీ దిగివస్తున్నాయి. ఇక మరోవైపు వెండి ధరలు కేజీకి బుధవారం ఏకంగా ఒక్కసారిగా ఆరువేలకు పైగా కిందికి దిగాయి. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు క్రమేపీ దిగివస్తున్నాయి. బంగారం ధరలు బుధవారం ధరలతో పోలిస్తే కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 23) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు భారీ పతనాన్ని నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం (23.09.2020) బంగారం ధరలు మంగళవారం ధరలతో పోలిస్తే తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 540 రూపాయలు తగ్గి 48,800 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 590 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,230 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు కిందికి..

బంగారం ధరలు తగ్గుదల కనబరిస్తే, వెండి ధరలు షాకిచ్చాయి. రికార్డు స్థాయిలో తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరల కంటే తగ్గాయి. ఈరోజు 6400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 60,600 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. బుధవారం (23.09.2020) బంగారం ధరలు మంగళవారం ధరలతో పోలిస్తే తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 540 రూపాయలు తగ్గి 48,800 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 590 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,230 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటి ప్రారంభధరతో పోలిస్తే 700 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 49,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం నాటి ప్రారంభధరతో పోలిస్తే 760 రూపాయలు తగ్గింది. దాంతో 54,000 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. వెండి ధరలు షాకిచ్చాయి. రికార్డు స్థాయిలో తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరల కంటే తగ్గాయి. ఈరోజు 6400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 60,600 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 23-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories