Gold Rate: భగ్గుమంటున్న బంగారం.. వెండి ధరలు..కొనాలంటే కష్టమే!

శ్రావణ మాసం ప్రారంభం అయిందో లేదో బంగారం భగ్గుమంది. ఇక వెండి తలుచుకోవడానికీ భయపడే విధంగా ఎగసింది. రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి.

K V D Varma
Published on: 23 July 2020 8:10 AM IST
gold and silver rate 23rd July
X
gold rate today

శ్రావణ మాసం ప్రారంభం అయిందో లేదో బంగారం భగ్గుమంది. ఇక వెండి తలుచుకోవడానికీ భయపడే విధంగా ఎగసింది. రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 23) దేశీయంగా భారీ పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (23.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 760 రూపాయలు పెరిగింది. దీంతో 47,850 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 830 రూపాయలు పెరిగింది. దీంతో 52 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 52,200రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరల మోత!

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు రికార్డు పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే ఏకంగా రికార్డు స్థాయిలో ఒక్కసారిగా 3550 రూపాయల భారీ పెరుగుదల నమోదు చేసింది. దీంతో 59 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరకు దగ్గరలోకి చేరింది. దీంతో కేజీ వెండి ధర 58,950 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 760 రూపాయలు పెరిగింది. దీంతో 47,850 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 830 రూపాయలు పెరిగింది. దీంతో 52 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 52,200రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం ధరతో పోలిస్తే 850 రూపాయలు పెరిగి 48,750 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం ధరతో పోలిస్తే 850 రూపాయలు పెరిగింది. దీంతో 49,950 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా రికార్డు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 59 వేల రూపాయల గరిష్ట రికార్డు ధర దగ్గరకు ఎగసింది. దీంతో కేజీ వెండి ధర 58,950 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 23-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story