Gold Rate: స్థిరంగా బంగారం ధరలు..ఎగసిన వెండి ధరలు!

Gold Rate: బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు పెరుగుదల బాట వదలలేదు. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

K V D Varma
Published on: 23 Feb 2021 7:30 AM IST
Gold rate today
X

బంగారం, వెండి ధరలు 

బంగారం ధరలు సోమవారం వారం మార్పులు లేకుండా ఉన్నాయి. దీంతో మంగళవారం మార్కెట్లు స్థిరంగా ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కదలిక లేకుండా ఉన్నాయి. బంగారం ధరలు ఈరోజు (23.02.2021) మార్పులు లేవు. మరో వైపు వెండి ధరలు కొద్దిగా పెరుగుదల కనబరిచాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. మంగళవారం (23.02.2021) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 43,260 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 47 వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా ఎగువన 47,190 రూపాయలుగా నిలిచింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు స్థిరంగా ఉంటె.. వెండి ధరలు మాత్రం పరుగులు తీశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 600 రూపాయలు పెరిగింది. దీంతో 74 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 74,400 రూపాయల వద్దకు ఎగబాకింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. మంగళవారం (23.02.2021) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 43,260 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 47 వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా ఎగువన 47,190 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు మిశ్రమంగా కదిలాయి. 22 క్యారెట్ల బంగారం మార్పులు లేకుండా ఉంటే.. 24 క్యారెట్ల బంగారం మాత్రం పై చూపులు చూసింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధర 45,410 రూపాయల వద్ద స్థిరంగా నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధర కంటే 90 రూపాయల పెరుగుదల నమోదు చేసి 49,530 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరకంటె 200 రూపాయల పెరుగుదల నమోదు చేసి 69 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగబాకాయి. దీంతో కేజీ వెండి ధర 69,200 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 23-02-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story