Gold Rate: ఎగసిన బంగారం ధరలు.. వెండి ధరల రికార్డు మోత!

నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి.

K V D Varma
Published on: 22 July 2020 8:37 AM IST
gold and silver rates today 22nd July
X
gold rate today

నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 22) దేశీయంగా పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు ఒక్కసారిగా రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (22.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 140 రూపాయలు పెరిగింది. దీంతో 47,090 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 130 రూపాయలు పెరిగింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,370రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరల మోత!

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు రికార్డు పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే ఏకంగా 2250 రూపాయల భారీ పెరుగుదల నమోదు చేసింది. దీంతో 55 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరకు చేరింది. దీంతో కేజీ వెండి ధర 55,400 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 140 రూపాయలు పెరిగింది. దీంతో 47,090 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 130 రూపాయలు పెరిగింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,370రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం ధరతో పోలిస్తే 50 రూపాయలు పెరిగి 47,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం ధరతో పోలిస్తే50 రూపాయలు పెరిగింది. దీంతో 49,100 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా రికార్డు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 55 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరకు ఎగసింది. దీంతో కేజీ వెండి ధర 55,400 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 22-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story