Gold rate today : పసిడి మిలమిల.. పెరుగుతూనే వస్తున్న ధర

బంగారం ధర వరుసగా 3వ రోజు పెరుగుతూ పోవడం గమనార్హం. ఈ మూడు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.790 పెరిగింది.

K V D Varma
Published on: 22 Feb 2020 8:54 AM IST
Gold rate today : పసిడి మిలమిల.. పెరుగుతూనే వస్తున్న ధర
X
బంగారం ప్రతీకాత్మక చిత్రం

బంగారం ధర వరుసగా 3వ రోజు పెరుగుతూ పోవడం గమనార్హం. ఈ మూడు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.790 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం కూడా బంగారం ధరల్లో తగ్గుదల లేదు. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు భారీ పెరుగుదల నమోదుచేసింది. మరో 10 రూపాయలు పెరిగింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు 43,420 రూపాయల నుంచి 43,430 రూపాయల వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పైకెగసింది. 10 గ్రాములకు 10 రూపాయలు పెరిగింది. దీంతో 39,800 రూపాయల నుంచి 39,810 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది..

స్థిరంగా వెండి ధరలు..

బంగారం ధరతో పాటు, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. దీంతో వెండి ధర నిన్నటి కేజీ కి 49,900 రూపాయల ధర వద్ద నిలిచింది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా..

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 43,430 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 39,810 రూపాయలు నమోదు చేశాయి. కాగా, వెండి ధర లు ఇక్కడా నిలకడగా ఉన్నాయి. దీంతో కెజీ వెండీ 49,900 రూపాయలకు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర లు భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు ఎగసి 41,860 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయలు పెరిగి 40,660 రూపాయల వద్దకు చేరింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా పెరిగింది.. దీంతో కేజీ వెండి 49,900 రూపాయలకు చేరుకుంది. ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 22-02-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story