Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలు తగ్గాయి..తాజా రేట్లిలా..!

Gold Rate: బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పైకెగశాయి. వెండి ధరలు ఈరోజు తగ్గుదల కనబరిచాయి.

K V D Varma
Published on: 21 Sept 2020 6:36 AM IST
Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలు తగ్గాయి..తాజా రేట్లిలా..!
X

gold rate today 

బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 21) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం (21.09.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయలు పెరిగి 49,590 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 220 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 54,060 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు కిందికి..

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరల కంటే తగ్గాయి. ఈరోజు 600 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 67,900 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. సోమవారం (21.09.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయలు పెరిగి 49,590 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 220 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 54,060 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు కొద్దిగాపెరియి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ప్రారంభధరతో పోలిస్తే 210 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50,360 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం నాటి ప్రారంభధరతో పోలిస్తే 160 రూపాయలు పెరిగింది. దాంతో 54,870 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరల కంటే తగ్గాయి. ఈరోజు 600 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 67,900 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 21-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story