Gold Rate: దిగివస్తున్న బంగారం ధరలు..భారీగా తగ్గిన వెండి ధరలు! లేటెస్ట్ రేట్లివే!

Gold Rate: బంగారం ధరలు ఈరోజు కిందికి కదిలాయి. వెండి ధరలు అమాంతం కిందికి దిగివచ్చాయి.

K V D Varma
Published on: 21 Aug 2020 9:51 AM IST
Gold rate today decreased
X
Gold rate today

నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజూ మరికొంత తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు మరికొంత తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 21) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు భారీ స్థాయిలో కిందికి దిగివచ్చాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొంత తగ్గుదల నమోదు చేశాయి. శుక్రవారం (21.08.2020) బంగారం ధరలు గురువారం ధరలతో పోలిస్తే తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 720 రూపాయలు తగ్గింది. దీంతో 50,840 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 780 రూపాయలు తగ్గింది. దీంతో 55,460 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే, వెండి ధరలు కూడా ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే భారీస్థాయిలో పతనం అయింది. ఈరోజు ఏకంగా 1100 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 67,000 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 720 రూపాయలు తగ్గింది. దీంతో 50,840 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 780 రూపాయలు తగ్గింది. దీంతో 55,460 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు కిందికి దిగివచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ధర కంటె 650 రూపాయలు తగ్గింది. దీంతో 51,200 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ధర ఏకంగా 710 రూపాయలు తగ్గింది. దాంతో 55,850 రూపాయలకు దిగివచ్చింది. ఇక వెండి ధరలు.. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే భారీస్థాయిలో పతనం అయింది. ఈరోజు ఏకంగా 1100 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 67,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 21-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story